Natyam ad

అమ్మ లేని జీవితం నాకు వద్దు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పిన అమ్మ మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నేదులూరు మండలం ముక్కేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా హరిక్ణృష్ణ(22) ఐటీఐ పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

 

Post Midle

స్నేహితుడితో కలిసి శ్రీకృష్ణానగర్‌లో అద్దెకుంటున్నాడు. 2021లో హరికృష్ణ తల్లి సత్యవాణి గుండెపోటుతో మృతి చెందింది. అప్పటి నుంచే తల్లిలేని జీవితం వృథా అంటూ హరికృష్ణ డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. తల్లి జ్ఞాపకాలతోనే గడిపేవాడు. పనికి కూడా సరిగ్గా వెళ్ళకుండా ఆలోచనలతోనే ఇంట్లో గడిపేవాడు. ఈ నేపథ్యంలోనే స్నేహితుడు వెంకటేశ్వర్‌రావు డ్యూటీకి వెళ్ళిన కొద్దిసేపటికే శుక్రవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తన కొడుకు మానసికంగా బాధపడుతూ కరెంటు వైరుతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి అర్జున్‌రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags; I don’t want a life without mom

Post Midle