భూమా అఖిలప్రియ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు

-నేను అజ్ఞాతంలో ఉన్నాను అనేది పూర్తిగా అవాస్తవం
-ఎలాంటి విచారణ కైనా నేను సిద్ధంగా ఉన్నాను, పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను
-దయచేసి నా మీద దుష్ప్రచారం మానేయండి
-దేవరకొండ వెంకటేశ్వరరావు అలియాస్ (లెఫ్ట్ వెంకటేశ్వరరావు_ )

Date:15/01/2021

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:

తనకు ప్రజలకు మంచి చేయడమే తెలుసు అని, కొందరు పనిగట్టుకుని తన మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని,వాస్తవంగా భూమా అఖిలప్రియ కేసులో తనకు  ఎలాంటి ప్రమేయం లేదని అని,తన మీద అవాస్తవాలు ప్రచారం చేసిన మీడియా సంస్థల మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఎస్టి నాయకుడు దేవరకొండ  వెంకటేశ్వరావు మీడియాకు తెలిపారు.
శుక్రవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో తెలంగాణలో జరిగిన భూమా అఖిలప్రియ ఈ సంఘటనను తనకు కావాలని అంట కడుతున్నారని, వైసిపి అభిమానిగా ఉన్న తన మీద కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, మీడియా వాస్తవాలు తెలుసుకోకుండా నామీద అవాస్తవాలు ప్రసారం చేయడం తగదని, తనకు ఎప్పుడు పేదలకు మంచి చేయడమే కాని, ఎలాంటి నేరపూరిత చరిత్ర లేదని ఈ సందర్భంగా దయచేసి తన మీద లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: I have nothing to do with the Bhuma Akhilapriya case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *