నా బ్రెస్ట్ పై చేతులు వేశాడు : పూజా

Date:06/10/2018
ముంబై ముచ్చట్లు:
లైంగిక వేధింపుల విషయంలో ఆడవాళ్లకు శత్రువులంటూ ఎక్కడో ఉండరని, స్నేహితులు, తెలిసిన వాళ్ల రూపంలోనే ఎక్కువగా ఉంటారని అభిప్రాయపడింది నటి, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ పూజాభట్. హీరోయిన్లపై, సాధారణ మగువల మీద సాగుతున్న లైంగిక వేధింపుల అంశం పై జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో పూజ స్పందిస్తూ.. తను ఎదుర్కొన్న అనుభవాన్ని కూడా వివరించింది.
తను ఒక స్నేహితుడి నుంచినే ఈ తరహా అనుభవాన్ని ఎదుర్కొన్నాను అని పూజ వివరించింది.
‘ఒక రోజు నాకు వీడ్కోలు పలకడానికని నా మిత్రుడు ఒకడు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అంత వరకూ బాగా మాట్లాడుకున్నాం. ఇక వెళ్తున్న తరుణంలో అతడు ఉన్నట్టుండి నా బ్రెస్ట్ మీద చేతులేశాడు, గట్టిగా పట్టుకున్నాడు..
అది నేను అస్సలు ఊహించని విషయం…’ అంటూ పూజ తన స్నేహితుడు తనతో ప్రవర్తించిన తీరును వివరించింది. ఇలా తెలిసిన వాళ్ల నుంచే ఇలాంటి అనుచితమైన అనుభవాలను ఎదుర్కొనాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని మహిళలు గ్రహించాలని.. మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎవరి నుంచి ఎప్పుడు ఎలాంటి అనుచితమైన ప్రవర్తన ఎదురవుతుందో అనే విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని పూజ అభిప్రాయపడింది.
Tags:I laid hands on my breast: Pooja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *