నేనే ఏ పార్టీలో చేరట్లేదు

హైదరాబాద్ ముచ్చట్లు:

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ మీడియా సమావేశం పెట్టారు. ఆయన త్వరలో పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. తాను ఎప్పుడూ పదవి కోసం ఆశించలేదన్నారు.
ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్నామన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో ఓటరు మమ్మల్ని నమ్మి ఓటు వేసిన వారికి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు మారాయన్నారు రమణ. అందుకే తాజా పరిస్థితుల్ని బట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారుటీఆరెస్ పార్టీ వారితో తాను ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు సాగానన్నారు. ఈ పార్టీలో ఉంటూనే ప్రజలకు తన వంతు సహాయం చేశానని తెలిపారు. తాను టిఆర్ఎస్ పార్టీ వాళ్లతో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తి అవాస్తవమన్నారు. ఏమైనా ఉంటే మీడియా ద్వారా సమాచారం అందిస్తామని ఎల్ రమణ పేర్కొన్నారు.ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయకూడదని హెచ్చరించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: I myself did not join any party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *