అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం టీవీ-5 కెమెరామెన్ శేఖర్ (42) గుండెపోటుతో మృతి చెందడం పట్ల రాష్ట్ర ఐ.అండ్.పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. టీవీ-5 కెమెరామెన్ శేఖర్ గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని అనంతపురం ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి ఐ.అండ్.పీఆర్ డైరెక్టర్ కి మంగళవారం ఉదయం తెలియజేయగా ఆయన శేఖర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. శేఖర్ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో ధైర్యం ప్రసాదించాలని డైరెక్టర్ కోరుకున్నారు.
Tags: I.&PR Director Himanshu Shukla expressed deep condolences over the death of TV-5 cameraman Shekhar.