దేశం సుభిక్షంగా ఉండాలని సుబ్రమణ్య స్వామిని ప్రార్థించా-  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి

– తమిళనాడు నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులకు సదుపాయాలు

తిరుత్తణి ముచ్చట్లు:


కరోనా నుంచి దేశం విముక్తి పొంది ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ సుబ్రమణ్య స్వామిని ప్రార్థించానని టీటీడీ  చైర్మన్   వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఆడికృత్తిక సందర్బంగా శనివారం ఆయన  సతీసమేతంగా తిరుత్తణి శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.తరువాత  తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను చైర్మన్ దంపతులు ఆలయ అర్చకులకు అందజేశారు ఈ వస్త్రాలను శ్రీ వల్లీ దేవసేన సుబ్రమణ్య  స్వామి ఉత్సవ మూర్తులకు అలంకరించారు. అలయ అర్చకులు అధికారులు చైర్మన్ దంపతులకు తీర్థ ప్రసాదాలు స్వామివారి వస్త్రాలు అందజేశారు.

 

 

ఈ  సందర్బంగా చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు  ఆడికృత్తిక సందర్బంగా టీటీడీ తరపున శ్రీ వల్లీ దేవసేన సుబ్రమణ్య స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.  తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు నడచివస్తారని చెప్పారు  వీరి కోసం టీటీడీ పలు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో    ఆలయ డిప్యూటీ కమిషనర్   విజయ తిరుమల ఆలయ పారు పత్తేదారు  ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: I prayed to Lord Subramanya Swamy to make the country prosperous – TTD Chairman YV Subbareddy

Leave A Reply

Your email address will not be published.