నా… పుంగనూరు నుంచి మహిళల రక్షణ కు నాంది పలకాలి

I want to talk about the safety of women from Punganoor

I want to talk about the safety of women from Punganoor

– సిని నటుడు సప్తగిరి పిలుపు

Date:18/05/2018

పుంగనూరు ముచ్చట్లు:

నన్ను అభివ్దృద్ధి చేసిన పుంగనూరు నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు నాంది పలకాలి…. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలవాలి. ఇదే నా కోరిక….నా అభిమానులు పుంగనూరు ప్రజలు ఇందుకు ఉధ్యమించాలి అంటు సిని నటుడు సప్తగిరి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో ఎస్పి రాజశేఖర్‌బాబు, అడిషినల్‌ ఎస్పి రాధిక లు కలసి మహిళలపై దాడులు అరికట్టాలి…. రక్షణ కల్పించాలంటు హ్యాక్‌తాన్‌ రెండవ విడత చైతన్య సదస్సును పుంగనూరులో డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ సాయినాథ్‌, ఎస్‌ అరుణ్‌కుమార్‌లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిని నటుడు సప్తగిరి, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న హాజరైయ్యారు. ఈ సందర్భంగా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. సిని నటుడు సప్తగిరికి అభిమానులు గజమాల వేసి, సత్కరించారు. ఈ సభలో సప్తగిరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు బాధకరమన్నారు. పురుషులు కామరాక్షసి చంపేయాలన్నారు. చట్టాలు మరింత కఠినంగా ఉండాలని తప్పు చేసిన వారిని తక్షణమే శిక్షించాలని కోరారు. కలెక్టర్‌, ఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్న చైతన్య సదస్సుకు ఆహ్వానం అందడం హర్షనీయమన్నారు. సినిమా సమావేశాలకే వెళ్తున్న తమకు ఇలాంటి ఆహ్వానం రావడం మహిళల రక్షణలో భాగస్వాములను చేయడం తమ అదృష్టమన్నారు. ఇక మీదట మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాలను నివారించడం, అడవులను కాపాడుతూ , పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తన అభిమానుల ద్వారా ప్రజలను చైతన్య పరస్తూ , సమాజాభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, వ్యాపార వేత్త ఆర్‌విటి.బాబు , సప్తగిరి స్నేహితులు రాఘవేంద్ర, హేము, సూరి, రాజేష్‌, రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మంజుల తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Tags: I want to talk about the safety of women from Punganoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *