శభరిమలై శ్రీ అయ్యప్పస్వామికి ఆగ్రహం వచ్చిందా..?

I was angry with Ayyappa Swamy

Date:13/08/2018

కేరళముచ్చట్లు:

ప్రపంచ ప్రసిద్దిగాంచిన శ్రీ శభరిమలై అయ్యప్పస్వామికి ఆగ్రహం వచ్చిందేమో… ! 26 సంవత్సరాల కాలంలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలతో కేరళ రాష్ట్ర తీవ్ర ముంపుకు గురైంది. ఆస్తులతో పాటు ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం గత రెండు సంవత్సరాలుగా శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలోనికి మహిళలను ప్రవేశింప చేయాలన్న ఆలోచనతో కొన్ని సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై దేశ అత్యున్నత స్థానంలో వాదపవాదనలు జరిగాయి. శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలోనికి మహిళలను ప్రవేశింప చేయడం ఆచార విరుద్ధమని, ఇలా చేస్తే పాపం అంటు పేర్కొన్నారు. కానీ మహిళలందరిని ప్రవేశింప చేయాలని, మహిళల హక్కులను భంగం వాటిల్లుతుందని సంస్థలు పట్టుబట్టాయి. ఈ కేసులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉండగా శభరిమలై క్షేత్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీటి ప్రవాహం తీవ్రం కావడంతో కేరళ రాష్ట్రంలోని శ్రీ శభరిమలై ఆలయం వద్ద ఉన్న పంపానది తీరం సైతం జలమయమైంది. శభరిమలైకు రాకపోకలు పూర్తిగా స్తంభించింది. కేరళ రాష్ట్రంలో ప్రజలు బిక్కుబిక్కుమంటు నిద్రా ఆహారాలు లేక భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి అంతటకి కారణం అయ్యప్పస్వామికి ఆగ్రహం వచ్చిందంటు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మచారిగా ఉన్న శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో మహిళల నిషేధాన్ని ఎత్తివేయాలనడంతో స్వామి ఈ హెచ్చరికలు చేశారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇకనైనా దీనిపై వివాదాలకు తావులేకుండ గతంలో ఎలాంటి పద్దతులు ఆలయంలో ఉండేదో వాటినే కొనసాగించాలని శ్రీ అయ్యప్పస్వామి భక్తులు కోరుతున్నారు.

వర్షం పడిందంటే కరెంట్ కట్

Tags: I was angry with Ayyappa Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *