మాన్సాస్ ట్రస్ట్ కు చైర్మన్ అవుతాను

Date:01/06/2020

విజయనగరంముచ్చట్లు:

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌లకు మళ్లీ తానే చైర్మన్‌ను అవుతానని… కోర్టులపై తనకు నమ్మకం ఉందని కేంద్రమాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం  మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని  ప్రభుత్వం ఉల్లంఘిస్తూ ముందుకు పోతుందని విమర్శించారు. హైకోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. మాన్సాస్  ట్రస్ట్ విషయంలో కూడా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్‌లో తన పేరు కూడా ఉందని ఆయన తెలిపారు.

 

 

 

మూడు లాంతర్ల  కూల్చి వేతకు… కోటలో విషయాలు ముడి పెట్టడం సరికాదన్నారు. 1984లో రాజ మహల్‌ను తొలగించామని…1986-88లో మోతీమహల్  రేనోవేషన్ చేశారన్నారు.   2014 తన అన్న ఆనంద గజపతి రాజు(సంచిత నాన్న) శిధిలావస్థలో ఉన్న  మోతీమహల్‌ను ప్రభుత్వ అనుమతితో కూల్చి వేసారని చెప్పారు. ఎవరో ఓక అమ్మాయిని తీసుకువచ్చి  మాన్సాస్ చైర్మన్ అన్నారని… ఆనంద గజపతి రాజు బ్రతికి ఉండగా.. సంచితా  ఒక్కసారి కూడా వచ్చి కలిసిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. 105 దేవాలయాల్లో ఏ ఒక్క పండగలోనూ ఆమె పాల్గొనలేదని విమర్శించారు. ఇప్పుడు ఆమే.. తనపై కత్తి దూస్తున్నారన్నారు.

 

 

 

తండ్రితో, తాతాతో ఏనాడూ లేని ఆమే ఈరోజు ఉద్దరిస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ఆస్తులు కాజేయాలని  ప్రస్తుత నేతలు చేస్తున్నారని ఆరోపించారు. సింహాచలం భూములను 30 ఏళ్ల క్రితం రేట్లకి, తక్కువ రేట్లకు ఇప్పుడు ప్రైవేటీకరణ సరికాదన్నారు. మోతీ మహల్ కూల్చివేత గురించి సంచిత తన తండ్రి ఆనంద్ గజపతిరాజు, తాత పివిజి  రాజుని ఆనాడే ప్రశ్నించి ఉంటే సరిపోయేదన్నారు. సంచిత కుటుంబం వాడిన బాషకి నాడు ఆనంద్ గజపతి చాలా బాధపడేవారని…తండ్రిని మానసికంగా వేధించారని అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు.

వలస కూలీలను నిజామాబాద్ నుండి  కరీంనగర్ రైల్వే స్టేషన్ కు

 

Tags: I will be chairman of the Mansaus Trust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *