విశాఖ ఉక్కును నేనే కొంటాను
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవే టీకరణ చేస్తుందన్న ప్రచారం నేపథ్యం లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తానే కొనుగోలు చేస్తా నని చెప్పారు. ఇందుకోసం 42 వేల కోట్లతో బిడ్ వేస్తానని, పదిహేను రోజు ల్లో 4 వేల కోట్లు ఇస్తానని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే తానే కొంటానని చెప్పారు.వేలంలో పాల్గొన డానికి అవసరమైన పేపర్ల కోసం అధికారులను సంప్రదిస్తున్నట్లు వివరిం చారు.వైసీపీ, టీడీపీ, సీపీఐ నేతలను కలిసి చర్చలు జరుపుతానని ఆయన వెల్లడించారు.
Tags: I will buy Visakha steel myself

