I will do my part to provide better services to the people

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నా సహకారాన్ని  అందిస్తాను

-మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Date:27/01/2020

వనపర్తి  ముచ్చట్లు:

ప్రజలు ఎంతో నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందున  తమకు ఎంతో బాధ్యత పెరిగిందని, అందుకోసం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వారికి తన సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.సోమవారం జరిగిన పదవి స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం నూతన చైర్మన్ ,వైస్ చైర్మన్, కౌన్సిలర్ లతో ఆయన ఫోటోలు దిగిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూజిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో  తెలంగాణ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించితెలంగాణ జెండా రెపరెపలాడింది సార్ అని ఆయన అన్నారు.దీంతో  చైర్మన్, వైస్ చైర్మన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని,గెలిచిన అభ్యర్థులంతా ప్రజల సేవలో నిమగ్నమై నిరంతరం అభివృద్ధి దశలో ప్రయత్నించాలని ఆయన అన్నారు.ముఖ్యంగా నూతన మున్సిపాలిటీ చట్టాన్ని అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రమాణాలు పెంచే విధంగా  విధంగా పారిశుద్ధ్యం, విద్య ,వైద్యం ,హరితహారం ,ప్లాస్టిక్ నిషేధం పై చిత్తశుద్ధితో పని చేస్తూ పురపాలక చట్టం ద్వారా పనులు చేస్తూ నిరంతరం ప్రజల సేవలో ఉండాలని ఆయన సూచించారు.

వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోవాలి

Tags: I will do my part to provide better services to the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *