నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను

Date:28/09/2020

– జ్యోతుల నవీన్

కాకినాడ  ముచ్చట్లు

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట: స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడి గా నియమితుడైన జ్యోతుల నవీన్ నీ పలువురు కలిసి పూలమాలలతో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నా గురువు, దైవం, నా తండ్రి  జ్యోతుల నెహ్రూ కి పాదాభివందనాలు సమర్పించుకుంటూ నాపై చంద్రబాబునాయుడు , యనమల రామకృష్ణుడు , నిమ్మకాయల చినరాజప్ప , పార్టీ పెద్దలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టత కోసం పని చేసి అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వైనాన్ని ఎదిరించి వారికి అండగా నిలబడి పార్టీ అధికారం దిశగా తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం నేను చేసి ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాడుతానని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం. గండేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు  కోర్పు సాయి తేజ. రేఖ బుల్లి రాజు. దేవరపల్లి మూర్తి బుర్రి సత్తిబాబు చాగంటి వీరబాబు  బుద్ధి రెడ్ల సుబ్బారావు బొడ్డేటి సుమన్ గళ్ళ శ్రీను. గుడివాడ రాజారావు అధిక సంఖ్యలో గ్రామాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.

 కృష్ణా వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి 

Tags:I will not waver in the trust placed in me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *