కోర్టులో నిరూపించుకుంటా..

I will Prove in court

I will Prove in court

సాక్షి

Date :19/01/2018

చిత్తూరు జైలు నుంచి విడుదలైన రాజేష్‌

సాక్షి, చిత్తూరు: తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకుంటానని తొలిరేయినాడే భార్యను చిత్రహింసలకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్‌ తెలిపారు. శుక్రవారం ఆయన చిత్తూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, పటుత్వ పరీక్షల్లో నెగ్గానని చెప్పారు. అకారణంగా 45 రోజులు జైలులో ఉన్నానని వాపోయారు.

గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌.. వి.కోటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడికి నవంబర్‌ 1న గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. సంసార జీవితానికి పనికిరాడంటూ ఆరోపణలు చేయడంతో తొలిరాత్రి నాడే భార్యపై దాడిచేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి..
ఈ ఉదంతంతో తమ ఊరి అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు భయపడుతున్నారని మోతరంగనపల్లి వాసులు అంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు వెళ్లిపోయాయని తెలిపారు. సంసారానికి పనికిరాడంటూ రాజేష్‌పై నిందలు వేశారని, పటుత్వ పరీక్షలో అతడికి ఎటువంటి లోపం లేదని తేలిందన్నారు. పదేపదే పనికిరానివాడంటూ, శాడిస్టు మొగుడంటూ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై నిందలు వేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనికి తమ ఊరి పరువు తీయొద్దని కోరుతున్నారు.

Tags: I will Prove in court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *