Natyam ad

విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మల్లేష్ కుటుంబాన్ని  ఆదుకుంటాను

-ఇల్లు తో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తా
-ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

 

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

 

విద్యుత్ ఘాతంతో మృతిచెందిన కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటానని ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం లింగాల మండలంలోని చెన్నంపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో మృతి చెందిన బొగ్గు మల్లేష్ కుటుంబ సభ్యులను పరమశించి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి పూరిగుడిసి ఉండడంతో ఇల్లు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో వారు మాట్లాడుతూ లింగాల నుంచి చెన్నంపల్లి వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు అడగడంతో మంజూరు చేయిస్తాని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కేటీ తిరుపతయ్య. పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి. వెంకటగిరి సుధీర్ గౌడ్ . సింగిల్  డైరెక్టర్ నరసింహ. శ్రీనివాసులు బంగారయ్య లింగాల సర్పంచు  తిరుపతయ్య. వెంకటగిరి మల్లేష్ ఎల్లేష్ నరసింహ . చెన్నంపల్లి గ్రామ సర్పంచ్ రవీందర్ నాయక్. చెన్నంపల్లి పంచాయతీ కార్యదర్శి నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: I will support the family of Mallesh who died due to electric shock

Post Midle