రూ:3 కోట్లతో ఆదర్శంగా భవనాలు నిర్మాణం

-19న మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి చే ప్రారంభోత్సవం
– రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా నిర్మాణపనులు పూర్తి
– ఏర్పాట్లపై సమీక్షించిన జెడ్పి సీఈఓ, పెద్దిరెడ్డి
– బహిరంగ సభ ఏర్పాటుకు స్థల పరిశీలన
చౌడేపల్లె ముచ్చట్లు:
రాష్ట్రంలోనే ఆదర్శంగా రూ:3 కోట్ల నిధులతో నిర్మించిన ఎంపీడీఓ, తహసీల్దార్‌ కార్యాలయాలకు భవన నిర్మాణపనులు పూర్తిచేసినట్లు జెడ్పి సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం వై ఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పిటీసీ దామోదరరాజు,ఏఐపీపీ మెంబరు అంజిబాబు, ఎంపీపీ రామమూర్తి, మంత్రి పిఏ తుకారం కలిసి భవన నిర్మాణపనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 19 వతేదిన బుధవారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పివి. మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వాకరనాథరెడ్డిలచే భవనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిలు, శిలాఫలకాల ఏర్పాటుపై అధికారులు, ప్రజాప్రతినిథులతో కలిసి సమీక్షించారు.మంత్రి పెద్దిరెడ్డి సూచనలమేరకు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఈ భవన నిర్మాణ పనులు చేపట్టి నిర్ణీత గడువుకు ముందే నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తిచేయడం జరిగిందని కాంట్రాక్టర్‌ను అభినందించారు. కార్యాలయం ఎదుట ఆకర్షణీయంగా పూల వెహోక్కలు పెంచాలని సూచించారు.మంత్రి, ఎంపీ పర్యటను పురస్కరించుకొని బహిరంగ సభ ఏర్పాటు కు స్థల పరిశీలన చేశారు. మండలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శంగా అమలు చేయడంతోపాటు , అభివృద్ది పనులు పూర్తిచేసి రాష్ట్రంలో ఆదర్శమండలంగా నిలవడానికి అధికారులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్‌, వైస్‌ఎంపీపీ నరసింహులు యాదవ్‌,పీహెచ్‌సీ కమిటీ చైర్మన్‌ కళ్యాణ్‌ నేతలు చిన్నప్ప, గోవిందు తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Ideal building construction with Rs: 3 crore

Leave A Reply

Your email address will not be published.