సంక్షేమంలో దేశానికే ఆదర్శం

చౌడేపల్లె ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ దామోదరరాజు అన్నారు. సోమవారం మండలంలోని గడ్డంవారిపల్లె, పరికిదొన గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్‌స ఫించన్‌ కానుక పెంపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట మేరకు సీఎం ఫించన్లును పెంచడంతోపాటు , పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూఅనేక పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనంతరం పరికిదొన సచివాలయంలో సీఎం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల చిత్రపటాలకు వృధ్దులు, ప్రజాప్రతినిథులు పాలాభిషేకం చేశారు. బ్రతికిననాళ్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికు రుణపడి ఉంటామని, ఎప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని అవ్వ, తాతలు, అక్క చెల్లెమ్మలు దీవెనలిచ్చారు. ఈ కార్యక్రమంలోమాజీఎంపీపీవెంకటరెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మిదేవి, భాగ్యవతి, ఎంపీటీసీ శ్రీరాములు నేతలు బాబు, రెడ్డెప్పరెడ్డి,గిరిబాబు,సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణ,హరిప్రసాద్‌ ,కృష్ణారెడ్డి తదితరులున్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Ideal for the country in welfare

Natyam ad