ఆదర్శ పాఠశాల,జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

Date:18/09/2020

వరంగల్  ముచ్చట్లు

పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులు ఆదర్శ పాఠశాల,జూనియర్ కళాశాలలో ఇంటర్ లో అడ్మిషన్ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్ని దేశాలు,రాష్ట్రాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయన్నారు.పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఉన్నత చదువులపై కూడా తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయని,ఇలాంటి సందర్భాల్లో విద్యార్థిని, విద్యార్థులకు అత్యున్నత మార్గం తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాలలు అని వెల్లడించారు.మండల కేంద్రంలో కార్పోరేట్ స్థాయికి ధీటుగా ఎంపీసీ,బీపీసీ,సీఈసీ గ్రూప్ లతో,విశాలమైన తరగతి గదులు,డిజిటల్ విద్యా విధానం ద్వారా భోధించుటకు సౌకర్యాలు,భౌతిక దూరంకు కావల్సిన అన్ని రకాల వసతులతో పాటు అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఉన్నట్లు స్పష్టం చేశారు.ఎంపీసీలో 40, బీపీసీలో 40,సీఈసీలో 40 సీట్లు ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.అడ్మిషన్లు పొందడం కోసం విద్యార్థులు పదవ తరగతి ఆన్ లైన్ మెమో,టీసీ,స్టడీ సర్టిఫికెట్,ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో పర్వతగిరి ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలని అన్నారు.తమ కళాశాలలో బాలికలకు పరిమిత సంఖ్యలో హాస్టల్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు.పూర్తి వివరాలకు 886989566,9912615493
ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. నేటి విపత్కర పరిస్థితులలో కార్పొరేట్ మాయలో పడి సుదూర ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడేకంటే స్థానిక మోడల్ జూనియర్ కళాశాలలో త్వరితగతిన అడ్మిషన్ పొందేందుకు అవకాశం ఉందన్నారు.మోడల్ స్కూల్ నందు పదవతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని,విద్యార్థులు తిరిగి ఇంటర్ అడ్మిషన్ పొందుటకు మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని సూచించారు.

చెరసాల మోషన్ పోస్టర్ , టైటిల్ లోగో లాంఛ్

Tags:Ideal school, start inter admissions in junior college

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *