ఆదర్శనీయుడు జక్కంశెట్టి

Idealist Jakkanketti

Idealist Jakkanketti

Date:22/11/2018
నరసాపురం ముచ్చట్లు:
శాసనసభ్యుడుగా, న్యాయవాదిగా, బడుగుబలహీన వర్గాల వారికి మంచి సేవలు అందించిన స్వర్గీయ జక్కంశెట్టి వెంకటేశ్వరరావు రేపటి తరాల  వారికి కూడ ఆదర్శనీయులు అని రాష్ట్ర కార్మిక, ఉఫాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. నరసాపురం మండలం లక్ష్మాణాశ్వరం గ్రామం లో స్వర్గీయ జక్కంశెట్టి వెంకటేశ్వరరావు సంస్కరణ సభలో గురువారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ నీతి, నీజాయితీ, నిబద్దత గల మహనాయకుడు జక్కంశెట్టి వెంకటేశ్వరరావు అని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేసారు. వారు జివించి ఉన్న కాలం శాసనసభ్యులుగా న్యాయవాదిగా ప్రజలకు ఎంతో సేవ చేసారని కొనియాడారు. అయన రాజకీయాలలో  రాజీపడలేదని, ప్రజలకు సేవ చేయడానికే అంకితం అయిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మన్ పసుపు లేటి, రత్నమాల, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు రఫీ ఉల్లా బెగ్, జిల్లా మత్సకార నాయకుడు చల్లారావు, మెగల్తూరు ,జెట్పిటీసి. గుబ్బల నాగరాజు, జిల్లా గౌడ సంఘం అద్యక్షుడు వెంకటస్వామి, బార్ అసోసియోషన్ అద్యక్షుడు పొలిశెట్టి, సురిబాబు,  నారాయణ మూర్తి  తదితరులు పాల్గోన్నారు.
Tags:Idealist Jakkanketti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *