Identification of Punganur with the census

జనగణమనతో పుంగనూరుకు గుర్తింపు

– ఎంపీ రెడ్డెప్ప

Date:22/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

దేశంలో ఎక్కడా లేని విధంగా నిత్యజనగణమన జాతీయ గీతాలాపనను పుంగనూరులో అమలు పరుస్తుండటంతో పుంగనూరుకు దేశస్థాయిలో గుర్తింపు లభించిందని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. ఆదివార ఆయన పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌లో జాతీయ గీతాలాపన లో కమిషనర్‌ కెఎల్‌.వర్మ , సీఐ గంగిరెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జనగణమన కమిటి మెంబర్లు పిఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, అయూబ్‌ఖాన్‌, దీపక్‌, శ్యామ్‌ప్రసాద్‌, ముత్యాలు కలసి జనగణమనను ఏర్పాటు చేశారని కొనియాడారు. 2018 ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం ప్రతి రోజు ఉదయం 8 గంటలకు నిర్వహించడం అభినందనీయమన్నారు. పట్టణ ప్రజలు స్వచ్చంధంగా వాహనాలను ఆపివేసి రోడ్డుపై నిలబడి జాతీయ గీతానికి వందనం చేయడం మరువలేనిదన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లోను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జె ఏసి చైర్మన్‌ వరదారెడ్డి, మున్సిపల్‌ ఉద్యోగులు సప్ధర్‌, సురేంద్రబాబు, రమేష్‌, శ్రీకాంత్‌, శ్రీనివాసులు, రఘునాథరెడ్డి , కుమార్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Identification of Punganur with the census

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *