సూర్యాపేట‌లో కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హావిష్క‌రణ

సూర్యాపేట  ముచ్చట్లు:
భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబుతో పాటు మ‌రికొంద‌రు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Idol of Colonel Santosh Babu at Suryapet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *