ప్రయివేట్ సంస్థల్లో దాడులు చేస్తే, టీడీపీకి  సంబంధం ఏంటీ

If attacks are made in private companies, TDP is associated with the ANT

If attacks are made in private companies, TDP is associated with the ANT

 Date:13/10/2018
విజయవాడ ముచ్చట్లు:
అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ప్రారంభించిన పవన్ కల్యాణ్, అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తిత్లీ తుఫాన్, రాష్ట్రంలోని జరుగుతోన్న ఐటీ దాడులతోపాటు వివిధ అంశాల గురించి మాట్లాడారు. తిత్లీ తుఫాన్ వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళంలో తర్వలోనే పర్యటిస్తానని అన్నారు. ఇప్పటికిప్పుడు అక్కడకు వెళ్తే సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే వెనకడుగు వేశానని తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోన్న ఐటీ దాడుల గురించి కూడా చర్చించామని వెల్లడించారు. ఢిల్లీలో జరిగినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయంలో ఐటీ సోదాలు చేస్తే తాము కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తాం.. కానీ ప్రయివేట్ సంస్థల్లో దాడులు చేస్తే, టీడీపీకి ఏంటి సంబంధం? దీనిపై కూడా ఎలా స్పందించాలో అర్థం కావడంలేదని అన్నారు. అంతేకాదు, తాను బీజేపీ నేతలతో కుమ్మక్కు అయినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
ప్రధాని మోదీ తనకేం అన్నయ్య కాదు, అమిత్ షా బాబాయి కూడా కాదు.. కనీసం బీజేపీ నేతలతో తనకు బంధుత్వం కూడా లేదు.. నా కుటుంబాన్నే వెనుకేసుకురాలేదు అలాంటప్పుడు వారికి ఎలా మద్దతు ఇస్తాను.. కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తాను జనసేనను స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మభ్యపెట్టే మాటలతో ప్రయోజనం ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకునేటట్టుయితే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ప్రతినిధులను తీసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని కోరారు. తాను ఇంతవరకూ ప్రధానిని కలవలేదని, అఖిలపక్షానికి తాము కూడా వస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటాలు చేద్దామని, మభ్యపెట్టే ప్రకటనలు చేయరాదని సూచించారు.
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ఒక్కో సందర్భంలో ఒక్కో మాట చెబుతున్నారని పవన్ విమర్శించారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసమే తాను సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయ జవాబుదారీతనం కోసమే పార్టీని స్థాపించానని, భావితరాల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జనసేన కవాతు ముఖ్యోద్దేశం కూడా జవాబుదారీతనం కోసమేనని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మీరెందుకు వెళ్లలేదని, ఇప్పుడు మళ్లీ అఖిలపక్షం నిర్వహించమంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… అందులోతనకు చిత్తశుద్ధి కనిపించలేదని, అందుకే వాటికి తాము వెళ్లలేదని వ్యాఖ్యానించారు. రాఫెల్ కుంభకోణంపై కూడా పవన్ సమాధానం దాటవేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయాలా? వద్దా అనేది మరో నాలుగైదు రోజుల్లో వెల్లడిస్తామని తెలియజేశారు.
Tags:If attacks are made in private companies, TDP is associated with the ANT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *