Natyam ad

తప్పుడు వార్తలు ప్రచురిస్తే ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం-సజ్జల

-విశాఖ డ్రాగ్స్ కేసులో టీడీపీకి, పురంధేశ్వరికి సంబంధం ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం-

-డ్రగ్స్‌ కేసులో దొంగే దొంగా దొంగా అన్నట్టుగా టీడీపీ ఆరోపణలు

 

తాడేపల్లి ముచ్చట్లు:

Post Midle

విశాఖ డ్రగ్స్‌ విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుమ్మడికాయలు బుజాలు తడుముకున్నట్లు ముందే టీడీపీ వాళ్లు బుజాలు తడుముకుంటున్నారని, డ్రగ్స్‌ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల.. తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసిందని అందుకు సంతోషంగా ఉందని, దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని సజ్జల పేర్కొన్నారు. అయితే ఈ కేసు సీబీఐ వారు చేధించిన మరుక్షణం నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు, తన కొడుకు లోకేష్ విమర్శలు దాడి మొదలు పెట్టారని, నిజానికి వారికే ఈ కేసులు సంబంధాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, టీడీపీ నేతలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నాని, చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు.

 

 

వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అని, పార్టీ అధినేతగా ఉన్న బాబు స్థాయిని మరిచి వీధి స్తాయి మనస్తతత్వంతో ప్రవర్తిస్తున్నారని సజ్జల విమర్శించారు. తప్పుడు చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని, గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌పై తూతు మంత్రంగా దాడుల చేశారని గుర్తు చేశారు. డ్రగ్స్‌ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని, తప్పు చేసి రివర్స్‌లో తమపైనే ఆరోపణలు చేయటం తగదని, తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారని అన్నారు.వైఎస్సార్‌సీపీకి జనాల్లో విపరీతమైన ఆదరణ చూసి తట్టుకోలేక, మళ్లీ ముఖ్యమంత్రి అవ్వనేమో అనే భయంతో చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆరోపించారు. ప్రజలకు చెప్పుకోవటానికి మంచి లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్‌ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తామని ఎన్నికల కమిషన్‌ కూడా డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని కోరతామని తెలిపారు. ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని, తప్పుడు ప్రచురణలు చేసే వారి పై ప్రెస్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

 

Tags:If false news is published, we will complain to the Press Council – Sajjala

Post Midle