నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తా

-రేవంత్ కు కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి సవాల్‌

 

వికారాబాద్‌  ముచ్చట్లు:

 

తాను పోలీస్‌ శాఖలో బదిలీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నానని టీపీసీపీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కొడంగల్‌ ఆర్‌ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పిచ్చోడి చేతికి పీసీసీ పదవి వచ్చిందని ఘాటుగా విమర్శించారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్‌ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.అబద్దాలతో చెలామణీ అవుతున్న రేవంత్ రెడ్డి లాంటి వంద మంది రేవంత్ రెడ్డిలను ఎదుర్కొవాడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నావని సొంత పార్టీ నేతలే విమర్శించారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పోరాటం చేయడానికి ఏం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.మా నాయకుడు కేసీఆర్‌ తెలంగాణ యూత్ ఐ కాన్ కేటీఆర్‌పై అడ్డమైన ఆరోపణలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు నీ సొంత నియోజకవర్గంలో సరైన విధంగా పర్యటన చెయ్యని నువ్వు సమస్యల గురించి రాష్ట్రం అంత తిరుగుతానంటే నమ్మటానికి ప్రజలు అమాయకలు కదన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: If he proves .. he will resign from his post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *