ఇలా అయితే కూల్చడం ఖాయం (పశ్చిమగోదావరి జిల్లా)

If it is a collapse (West Bengal district)

If it is a collapse (West Bengal district)

Date:22/09/2018
ఏలూరు ముచ్చట్లు:
మున్సిపాలిటీల్లో నిబంధనలను అతిక్రమించి చేపట్టిన అక్రమ కట్టడాలపై త్వరలోనే కొరడా ఝళిపించనున్నారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపీఎస్‌ గడువు ఈ నెల 30న ముగుస్తుంది. దీనిపై స్పందించని ఆయా భవన యజమానులకు పట్టణ ప్రణాళిక అధికారులు ఇప్పటికే తుది నోటీసులు కూడా జారీ చేశారు.
ఈ నేపథ్యంలో మున్సిపల్‌ డైరెక్టర్‌ ఆయా మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులకు వీడియో సమావేశాలు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే దఫదఫాలుగా భవనాలను క్రమబద్ధీకరించేందుకు పథకాన్ని పొడిగించి సంబంధిత నిర్మాణదారులకు అవకాశం కల్పించారు. ఇదే ఆఖరి అవకాశమని, వినియోగించుకోని అక్రమ నిర్మాణదారులపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పథకాన్ని తొలుత 2007లో ప్రవేశపెట్టారు. 2010 నవంబరు నాటికి పూర్తి చేయాలని భావించారు. ఆశించిన మేర స్పందన రాకపోవడంతో దఫదఫాలుగా ప్రభుత్వం పొడిగించింది. ఆఖరుగా ఈ ఏడాది జులై 31 వరకు గడువును పొడిగించారు. దీనికి కూడా స్పందన రాకపోవడంతో గడువును ఈ నెల 30 తేదీ వరకు పొడిగించారు. ఈ గడువులోపు అక్రమ భవన నిర్మాణదారులు పథకాన్ని వినియోగించుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో రెడ్‌ నోటీసులు కూడా జారీ చేశారు.
వీటికి స్పందించని సంబంధిత యజమానులకు నూరు శాతం అదనపు పన్నులు విధించనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం విధించిన గడువులోపు పథకాన్ని వినియోగించుకోని వారిపై చట్టపరమైన చర్యలతో పాటు భవనాలను కూల్చివేస్తామని పట్టణ ప్రణాళిక అధికారులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో బీపీఎస్‌ పథకానికి ఆన్‌లైన్‌ ద్వారా 4634 మంది భవన యజమానులు అక్రమ భవనాలను క్రమబద్దీకరించుకొనేందుకు దరఖాస్తు చేసుకొన్నారు.
వీటి ద్వారా ఇప్పటి వరకు 3831 దరఖాస్తులను పరిష్కరించగా ఆయా మున్సిపాలిటీలకు రూ. 43.28 కోట్లు ఆదాయం సమకూరింది. జిల్లాలో అత్యధికంగా భీమవరం పురపాలక సంఘానికి 1155 దరఖాస్తులు రాగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నుంచి అత్యల్పంగా 78 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నరసాపురం మున్సిపాలిటీకి 142 దరఖాస్తులు రాగా 140 దరఖాస్తులను పరిష్కరించి ప్రథమ స్థానంలో నిలిచింది.
భవన నిర్మాణాలకు అనుమతులు పొంది వాటికి భిన్నంగా నిర్మాణాలు చేపట్టిన, అసలు అనుమతులు పొందకుండా చేపట్టిన భవనాలను క్రమబద్దీకరించుకొనేందుకు బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం ద్వారా ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నెంబర్‌ 128ని విడుదల చేసింది. ఈ జీవోతో 1985 జనవరి ఒకటి నుంచి 2014 డిసెంబరు 31 తేదీ వరకు నిబంధనలు పాటించకుండా అనధికారికంగా నిర్మించిన ప్లాన్లకు విరుద్దంగా ఏర్పాటు చేసిన భవనాలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్దీకరించుకొనే వెసులుబాటు కల్పించింది.
Tags:If it is a collapse (West Bengal district)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *