కేసినో పెట్టానని నిరూపిస్తే.. పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా: మంత్రి కొడాలి నాని

విజయవాడ  ముచ్చట్లు:
 
కేసినో నిర్వహించారన్న వ్యాఖ్యలకు సంబంధించి గుడివాడలో తన కె కన్వెన్షన్ సెంటర్‌లో మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసినో అంటే
చంద్రబాబుకు, లోకేష్‌కు బాగా తెలుసని అన్నారు. తన కల్యాణ మండపంలో కేసినో పెట్టానని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని తీవ్రమైన వ్యాఖ్యలుచేశారు. ఎక్కడో జరిగిన దృశ్యాలు తీసుకువచ్చి తన కన్వెన్షన్‌లో జరిగినట్టుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. అలాంటప్పుడు నిజనిర్దారణ కమిటీ వచ్చినప్పుడు లోపలకు వెళ్లనీయకుండా ఎందుకు వైసీపీ
శ్రేణులు అడ్డుకున్నారని ప్రశ్నించిన మీడియాకు మంత్రి సమాధానం ఇవ్వలేదు. మంత్రి వాడిన పదాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు.పోలీసులు ఉండబట్టే వాళ్లు బతికి బయటకొచ్చారని లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉండేవని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: If it is proved that the casino was set up .. petrol will be poured and it will die: Minister Kodali Nani

Leave A Reply

Your email address will not be published.