దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేస్తా
దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది
పేదలు కూడా తమ కలల్ని నిజం చేసుకోవచ్చు అని తనతో రుజువైంది
భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ద్రౌపది ముర్ము
ప్రమాణం చేయించిన సుప్రిన్ కోర్ట్ న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ద్రౌపది ముర్ము. ప్రమాణం చేయించారు భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. పార్లమెంట్‌కు చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ముర్ముకు త్రివిధ దళాల గన్ సెల్యూట్ చేసారు.
15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నికకావడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేస్తానన్నారు. దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పేదలు కూడా తమ కలల్ని నిజం చేసుకోవచ్చు అని తనతో రుజువైందన్నారు. మీ నమ్మకం, మద్దతు బాధ్యతల్ని నిర్వర్తించేందుకు తనకు శక్తినిస్తుందన్నారు. భారత్ స్వాతంత్య్రం సాధించిన తర్వాత పుట్టిన తొలి రాష్ట్రపతిని తానే అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు ఆశయాలకు తగినట్లు అభివృద్ధిలో వేగం పెంచాలన్నారు.రాష్ట్రపతి పోస్టును చేరుకోవడం తన వ్యక్తిగత ఘనతగా భావించడం లేదని, ఇది భారత్‌లో ఉన్న ప్రతి పేదవాడి అచీవ్మెంట్ అని, తాను రాష్ట్రపతిగా నామినేట్ అవ్వడం అంటే, దేశంలో పేదలు కలలు కనవచ్చు అని, వాళ్లు ఆ కలల్ని నిజం చేసుకోవచ్చు అని రుజువైందన్నారు.
ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న పేదలు, దళితులు, వెనుకబడినవాళ్లు, గిరిజనులు, తనను ఆశాకిరణంగా చూడవచ్చు అన్నారు. తన నామినేషన్ వెనుక పేదల ఆశీస్సులు ఉన్నాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కోట్లాది మహిళల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. హాల్ నుంచి బయటకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము. వెంట.. సీజే ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా. గౌరవ వందనం స్వీకరణ.ముర్ము ప్రసంగం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాని , కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులకు అభివాదం చేశారు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Tags: If it works to maintain the faith of the people of the country