కొవిడ్ టీకాకు వెళ్తే.. ‘రేబిస్ఇంజెక్షన్ ఇచ్చారు

నల్గొండ జిల్లా కట్టంగూరు పీహెచ్సీలో ఘటన
నల్గోండ  ముచ్చట్లు:
కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళితే అక్కడ కుక్క కాటుకు ఇచ్చే యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఇచ్చారు.  బాధితురాలు ప్రమీల కట్టంగూరు పీహెచ్సీకి వెళ్లారు. పీహెచ్సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పీహెచ్సీకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు  అక్కడి నర్సు యాంటి రేబిస్ వ్యాక్సిన్ను వేసింది.   కొవిడ్ టీకా ఇవ్వాలంటూ చెప్పినా తనకూ అదే సిరంజీతో యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ప్రమీల ఆరోపించారు. ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా ‘బాధితురాలు కరోనా టీకా బ్లాక్లోకి కాకుండా, యాంటిరేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదు. టీటీ ఇంజక్షన్ ఇచ్చాం. దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలిపారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:If Kovid goes for vaccination .. ‘He was given rabies injection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *