Natyam ad

వర్గీకరణ చేయకుంటే బీజేపీ సంగతేందో  తేలుస్తాం

-సోషలిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ
-మంథని చేరుకున్న మాదిగల సంగ్రామయాత్ర, స్వాగతం పలికిన ఉద్యమ శ్రేణులు

మంథని ముచ్చట్లు:

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బచ్చల రజినీ కాంత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగ్రామయాత్ర సోమవారం  మంథని కి చేరుకున్నది . ఉద్యమ శ్రేణులు ఘన స్వాగతంపలికారు. మహాజన సోషలిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంథని లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంథని సామ్యెల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా సానుకూల నిర్ణయం తీసుకోకుండా వస్తే హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ సమావేశాలను అడ్డుకుంటామని గుర్తు చేశారు. అందుకు జూలై 2 న “సడక్ బంద్” జూలై 3న చలో హైదరాబాద్ ‘మహాగర్జన’ నిర్వహిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎనిమిది సంవత్సరాలకాలంగా అధికారంలో ఉండికూడా వర్గీకరణ చేయలేదని గుర్తు చేశారు. 1996 లోనే తిరుపతి తీర్మానం ద్వారా వర్గీకరణ న్యాయబద్దమని, మందకృష్ణ మాదిగ  నిరంతర పోరాటం లో మద్దతుగా ఉన్నట్లు నటిస్తున్నారని అన్నారు. వర్గీకరణ పై తిరుపతి తీర్మానంబూటకమా… బీజేపీ నేతలనాటకమా.. తెలంగాణ లోని బీజేపీ పెద్దలు తేల్చాలని గుర్తు చేస్తున్నానన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కాలని చూస్తే.. సామాజిక న్యాయాన్ని కోరుకునే వర్గాలు తమ ప్రతీకారం తీర్చుకోక తప్పదని జూలై 2 లోగా వర్గీకరణ పై బీజేపీ మాట నిలబెట్టుకుంటుందో, ప్రజాగ్రహానికి గురౌతుందో తేల్చుకోవాలని  పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో  నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మంథని చందు,లింగాగౌడ్ కొయ్యల మొండి ,మందరవి, పవన్, కార్తీక్, రాకేష్, రంజిత్, బాపు కాంపెల్లిస్వామి మంథని లింగయ్య,సింగారపుసుధాకర్, అశోక్ ,  అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: If not categorized, we will know what the BJP is up to

Post Midle

Leave A Reply

Your email address will not be published.