If SEC goes ahead with the conduct of elections - CM Jagan‌

ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తే – సీఎం జగన్‌

Date:30/10/2020

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్థానిక ఎన్నికల నిర్వహణకోసం రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం వర్సెస్‌ ఎస్‌ఈసీ వార్‌ మళ్లి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్‌ నీలం సాహ్నితో నివేదిక ఇప్పించింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఖాతరు చేయకుండా ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తే ఎలా అన్నదానిపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం ఒక వైపు న్యాయ కోవిదుల సూచనలు, సలహాలు తీసుకుంటూనే, మరోవైపు పదవీ విరమణ చేసిన ఎన్నికల కమిషనర్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దేశంలోని ఏఏ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అప్పుడు అక్కడ ఏ విధంగా ఆ సమస్యనుండి గట్టెక్కగలిగారు అన్నదానిపై వారితో చర్చిస్తున్నట్లుగా సమాచారం. దీనికితోడు ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వంతో సంప్రదింపులు తప్పనిసరి అని సుప్రీంకోర్టు చేసిన సూచనలను ఎస్‌ఈసీ అతిక్రమించే పరిస్థితులు లేవని చెబుతున్నారు. అయినప్పటికీ కీడెంచి మేలెంచాలన్న చందంగా ముందుగానే సీఎం జగన్‌ న్యాయకోవిదులతో పాటు పదవీ విరమణ చేసిన ఎన్నికల కమీషనర్లతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వాట్స్ అండ్ వోల్ట్స్” కంపెనీలో భాగస్వామి గా హీరో విజయ్ దేవరకొండ

Tags: If SEC goes ahead with the conduct of elections – CM Jagan‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *