If the 'App' is licensed and registration documents,

‘యాప్’ లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటే చాలు!

Date:10/08/2018
న్యూ డిల్లీ  ముచ్చట్లు:
వాహనచోదకులకు శుభవార్త. ఇకపై  డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు.. తదితర పత్రాలను డిజి లాకర్ యాప్ లేదా ఎంపరివాహన్ మొబైల్ యాప్ లో భద్రపరచుకుంటే సరిపోతుంది. వీటిలో భద్రపరచుకున్న పత్రాలను ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు వారికి చూపిస్తే సరిపోతుందని, ఈ నిబంధ నేటి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు పంపింది. ఈ యాప్స్ లో ఉన్న పత్రాలను అధికారిక ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ఆదేశించింది. కాగా, ‘డిజిలాకర్’ లో ఉన్న వాహన పత్రాలను చూపిస్తే పోలీసులు వాటిని అధికారిక పత్రాలుగా గుర్తించడం లేదని వాహనదారుల నుంచి కేంద్ర రవాణా శాఖకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తొలిసారిగా ‘డిజిలాకర్’లో ఉన్న పత్రాలను లీగల్ డాక్యుమెంట్స్ గా పరిగణించారు.
Tags:If the ‘App’ is licensed and registration documents,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *