Natyam ad

సైన్స్ ఆవిష్కరణల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తే.మత, మౌడ్యవిధానాలకు చరమగీతం పాడవచ్చు!!

-డా.. బ్రహ్మ రెడ్డి… జనవిజ్ఞాన వేదిక, వ్యవస్థాపకులు.

 

తిరుపతి ముచ్చట్లు:


నేడు సమాజంలో ప్రజలు సుఖ ,సంతోషాలతో జీవనం సాగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం సైన్స్ ఆవిష్కరణలేనని జన విజ్ఞాన వేదిక నేత వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ఎస్టియు భవన్ లో జనవిజ్ఞాన వేదిక సభ్యులు సానుభూతిపరులతో నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సైన్స్ ఆవిష్కరణ లను సాక్షాత్తు ప్రధాని మంత్రి అపహాస్యం చేస్తూ సైన్స్ కాంగ్రెస్ లో ప్రసంగించడం అభ్యంతరకరమన్నారు. ఏనుగు తలను వినాయకుడికి అతికించడం ప్లాస్టిక్ సర్జరీగా ప్రజలను నమ్మించడం ఆయన స్థాయికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగంలోని 51 ఆర్టికల్ లో ఉదహరించిన అంశాలకు భిన్నంగా మానవ హక్కుల ఉల్లంఘన ఇతర మతాల పట్ల వివక్షత, అసహనం పెట్రేగిపోతున్నా ప్రధాని వాటిని నిర్మూలించకపోగా మరింత ప్రోత్సహించే పద్ధతిలో వ్యవహరించడం దుర్మార్గమన్నారు. హక్కులనేత స్టెన్ స్వామిని జైల్లోనే చనిపోయేలా చేయడం, బల్కినో భాను కేసులో ముద్దాయిలకు విడుదల చేయడం ప్రభుత్వ కిరాతక చర్యలుగా పేర్కొన్నారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్యహననం

 

 

 

Post Midle

, నిరంకుశ పాలన కార్మిక, రైతాంగ, విధానాలు, నిరుద్యోగ సమస్యను పెంచి పోషించి డం, వంటి దురాగతాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్రలేని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పునికి పుచ్చుకుని నేడు యధేచ్ఛగా ఇతర మతాలపై దాడులు చేయడం, మహిళలు, దళితులు ,ఆదివాసీల హక్కుల కాలరాయడం సర్వ సాధారణమైపోయిందన్నారు. నేటి కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాల కుటిల పన్నాగం ఫలితంగా అధికారంలోకి వచ్చారని, ప్రజలు జాగృతమై సైన్స్ ఆవిష్కరణల ఫలితాలను, వివరిస్తూ విద్యార్థి యువకులను చైతన్యం ,కల్పిస్తే పది సంవత్సరాల లోనే సత్ఫలితాలు సాధించగలమని తెలిపారు..ఆదిశగా జన విజ్ఞాన వేదిక ,రాజకీయాలకతీతంగా ప్రజానీకాన్ని సంఘటితం చేయాలని, పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, గోవిందయ్య ఎస్ టి యు నాయకులు ధనంజయ నాయుడు, రేణుక దేవి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

 

Tags:If the benefits of scientific discoveries are explained to the people, we can sing praises to religion and materialism!!

Post Midle