కేంద్రం, రాష్ట్రం కలిస్తే.. పెట్రోలు ధరలు తగ్గించొచ్చు

Date:20/02/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

పెట్రోల్ ధర పరుగులు పెడుతోంది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో దూసుకువెళ్తోంది. దేశంలో దేశీ ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఇలా ధరలు పెరగడం గతంలో మరెప్పుడూ లేదని చెప్పుకోవచ్చు. ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇది ఇబ్బందికరమైన సమస్య అన్నారు. దేశీ ఇంధన ధరల తగ్గింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.పెట్రోల్ ధరలో పన్నులు 60 శాతం ఉన్నాయి. డీజిల్ ధరలో 54 శాతం పన్నులు ఉన్నాయి. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని ధరలను ఆమోదయోగ్యమైన స్థాయికి తగ్గించుకుంటే బాగుంటుంది. అయితే ఇది సాధ్యమయ్యే అంశం మాత్రం కాదని చెప్పుకోవచ్చు.ఇకపోతే దేశీ ఇంధన ధరలు వరుసగా 12 రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు పెట్రోల్ రేటు 40 పైసలు, డీజిల్ ధర 40 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.18కు, డీజిల్ ధర రూ.88.31కు చేరాయి.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 39 పైసలు పెరుగుదలతో రూ.96.48కు చేరింది. డీజిల్‌ ధర 39 పైసలు పెరుగుదలతో రూ.90.10కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 39 పైసలు పెరుగుదలతో రూ.96.35కు చేరింది. డీజిల్ ధర 39 పైసలు పెరుగుదలతో రూ.89.98కు ఎగసింది.

పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్‌.

Tags; If the center and the state come together .. petrol prices will come down

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *