భార‌తీయుడు 2 బ్రేక్ అయిన‌ట్లేనా

Date:26/10/2020

చెన్నై ‌ ముచ్చట్లు:

తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ అంటే భారీ తనం.. భారీ బడ్జెట్ అంటే శంకర్. కానీ శంకర్ కి భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలైతే దొరుకుతున్నారు కానీ.. ఆయన సినిమాలే ప్రేక్షకులకు నచ్చడం లేదు. రోబో 2.ఓ అట్టర్ ప్లాప్ తర్వాత శంకర్ మీద నమ్మకంతో లైకా ప్రొడక్షన్స్ వారు టాలీవుడ్ నిర్మాత నిర్మాతగా మొదలైన భారతీయుడు 2 సినిమాని హ్యాండిల్ చేసారు. దిల్ రాజు తప్పుకోవడంతో రంగంలోకి లైకా వారు దిగారు. ఇక శంకర్ అడిగిన బడ్జెట్ పెట్టడానికి రెడీ అవడమేకాదు.. కొన్ని భారీ సెట్స్ కూడా వేయించారు. కమల్ హాసన్ తో శంకర్ షూటింగ్ కూడా మొదలు పెట్టాక కొద్దిమేర షూటింగ్ జరిగాక సెట్స్ లో జరిగిన ప్రమాదంలో కొంతమంది చనిపోగా.. దర్శకుడికి – నిర్మాతలకు మధ్యన విభేదాలు మొదలయ్యాయి.అయితే భారతీయుడు 2 కి కాస్త బడ్జెట్ కంట్రోల్ పెట్టమని లైకా వారు శంకర్ కి ప్రపోజల్ పెట్టారట. కానీ శంకర్ ససేమిరా అనడమే కాదు.. ప్రమాదం జరిగి చాలా రోజులైనా షూటింగ్ విషయం లైకా ప్రొడక్షన్స్ వారు ఎటు తేల్చడం లేదని శంకర్ లైకా వారికీ బహిరంగంగా ఓ లేఖ రాసాడు. షూటింగ్ మొదలు పెట్టండి.. కనీసం క్లారిటీ ఇవ్వండి.. లేదంటే నేను వేరే సినిమాకి వెళ్ళిపోతా అని. మరి శంకర్ లేఖ రాసి మూడు రోజులైనా లైకా వారు స్పందించకపోవడంతో శంకర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనే టాక్ మొదలయ్యింది. అంటే భారతీయుడు 2 ఇక ఆగిపోయినట్లే అంటున్నారు. మరి నిర్మాతలు – దర్శకుడు మధ్య ఇంత జరుగుతున్నా హీరో కమల్ ఇక్కడ మాట్లాడకపోవడంతో శంకర్ ఇక చేసేది లేక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

32 మంది నక్సల్స్ లొంగుబాటు. 

Tags: If the Indian breaks 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *