అన్యాయం జరిగితే పోలీస్ లనే ఆశ్రయించాలి

Date:14/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా ప్రకంపనలు రేపుతున్న నటి శ్రీ రెడ్డి ప్రొటస్ట్‌పై ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలికాని, మీడియాకు ఎక్కడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో జమ్ము కాశ్మీర్‌లో బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ మౌన దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి ఇష్యూపై స్పందించారు. .. ‘ఇండస్ట్రీలో ఎవరైనా తప్పులు చేస్తే.. టీవీలకు వస్తే లాభం లేదు. కోర్టుల్లో కేసులు వేయమనండి. పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టమనండి అన్నారు. శ్రీరెడ్డి ఇష్యూలో నా స్పందన ఇదే. అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలిపితే లాభం ఉండదు. దానికి కారణమైన వారిపై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నాకు అన్యాయం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వాలి. అలా కాకుండా మీడియాకెక్కిడం, ప్రదర్శనలు చేయడం కరెక్ట్ కాదు. మీడియాకెక్కి మనం ఎంత మాట్లాడినా.. మీడియా సమాచారాన్నిమాత్రమే ఇవ్వగలరు కాని నిజమైన న్యాయం ప్రభుత్వావల్లే సాధ్యం అవుతుంది. చట్ట సభల ద్వారానే న్యాయం జరుగుతుంది. తను మద్దతు కోరింది కాబట్టి ఇస్తా.. కాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేను. వెంటనే న్యాయం జరగాలంటే నేనేమీ పోలీస్‌ని కాదు, న్యాయ మూర్తిని కాదు. ఇలాంటి సంఘటనలు నేనూ చూశానని వాటిని ఖండించా. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంతేకాని టీఆర్పీ రేటింగ్స్ కోసం తాపత్రయ పడకూడదు. నేను ఈ సెన్సేషనలిజం‌కు వ్యతిరేకం అన్నారు పవన్ కళ్యాణ్.
Tags:If the injustice happens, the police should resort to it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *