పార్టీలు మారినా… జూపూడికి కలిసొస్తున్న కాలం

ఒంగోలు  ముచ్చట్లు:
పూడి ప్రభాకర్ రావు నక్కను తొక్కి వచ్చినట్లే ఉంది. పార్టీలు మారుతున్నా ఆయనకు పదవులు దక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న జూపూడి ప్రభాకర్ రావు వైసీపీ లో చేరిన కొద్ది నెలలకే పదవిని దక్కించుకోవడం నిజంగా అదృష్టమే. జూపూడి ప్రభాకర్ రావుకు జగన్ నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్ రావును నియమించారు.జూపూడి ప్రభాకర్ రావు 2014 ఎన్నికలకు వరకూ వైసీపీలోనే ఉన్నారు. కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటిమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన వైసీపీ నుంచి జంప్ చేశారు. జగన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో జూపూడి ప్రభాకర్ రావు అప్పట్లో ముందున్నారు. చంద్రబాబు జూపూడి ప్రభాకర్ రావుకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇచ్చి గౌరవించారు. పదవీ కాలంలో ఆయన బాగానే కుదురుకున్నారు.కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వెంటనే జూపూడి ప్రభాకర్ రావు రూటు మార్చి వైసీపీలో చేరిపోయారు. జగన్ కూడా సాదరంగానే ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పదవి వస్తుందని కొంతకాలం, కొండపి ఇన్ చార్జి పదవి ఇస్తారని మరికొంత కాలం జూపూడి ప్రభాకర్ రావు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ రెండు పదవులకు జూపూడిని జగన్ దూరంగానే ఉంచారు. జూపూడి ప్రభాకర్ రావు కూడా ఓపికతో ఎదురు చూశారు.ఇటీవల కాలంలో కొంత యాక్టివ్ అయ్యారు. దీంతో జూపూడి ప్రభాకర్ రావు నామినేటెడ్ పోస్టు దక్కింది. ఇక వైసీపీలో ఆయన ఈ పోస్టుతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పోస్టు ఆయనకు దక్కదు. వచ్చే ఎన్నికలలోనూ టిక్కెట్ జూపూడి ప్రభాకర్ రావు కు దక్కే అవకాశం లేదని జగన్ ఈ నామినేటెడ్ పోస్టు ద్వారా చెప్పినట్లయింది. రానున్న కాలంలో జూపూడి ప్రభాకర్ రావుతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగన్ ముందుజాగ్రత్తగానే ఈ పదవి ఇచ్చారన్నది పార్బీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

 

Tags:If the parties change … it is time to meet Jupudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *