ప్రాజెక్టులు నిర్మిస్తే నష్టం ఎవరికి …
సోమల ముచ్చట్లు:
సోమల మండలం ఆవులపల్లె వద్ద సీతమ్మ చెరువులో నిర్మిస్తున్న ప్రాజెక్టు ద్వారా సుమారు 6 మండలాల రైతులకు ఉపయోగం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నష్టం ఎవరికి. ఈ ప్రాంతంలో చంద్రబాబునాయుడుకు పొలాలు లేవు. ఆయన తప్పుడు కేసులు వేసి మారైతులకు కడుపు కొడుతున్నారు. ప్రాజెక్టు నిర్మిస్తే సంవత్సరంలో మూడు పంటలు పండిస్తాం. అలాంటి ప్రాజెక్టులను అడ్డుకుంటే తగిన గుణపాఠం నేర్పుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.

ప్రాజెక్టు కట్టమన్నది వారే…
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల పర్యటనలో ప్రాజెక్టు నిర్మించాలని ప్రస్తుతం కేసు దాఖలు చేసిన వారు అర్జీలు ఇచ్చారు. ఇప్పుడు పచ్చనాయకుల మాట విని కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చారు. పదివేల ఎకరాల సాగుభూమికి నీరు అందకుండ చేస్తే తెలుగుదేశం నాయకులకు వచ్చే లాభం ఏమి. రైతులు ప్రాజెక్టుతో జరిగే మేలును గుర్తించాలి.
– కృష్ణమ నాయుడు, నాగిళ్లవారిపల్లె , సోమల మండలం
పెద్దిరెడ్డికి రైతుల సమస్యలు తెలుసు….
మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు రైతుల కష్టాలు తెలుసు. పద్నాలుగు సంవత్సరాలలో చంద్రబాబునాయుడు చేయని గొప్ప ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కానీ నీచ బుద్దితో చంద్రబాబు కుట్రపన్ని ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారు.
– లక్ష్మీసుధ, నాగిళ్లవారిపల్లె, సోమల మండలం.
స్టేలతో అభివృద్ధికి అడ్డు…
నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలకు , రైతులకు సాగునీరు-తాగునీరు అందించేందుకు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మిస్తున్న ప్రాజెక్టులపై స్టేలు తెచ్చారు. అభివృద్ధికి సహకరించాలే తప్పా అడ్డుకోరాదు. ఇలా చేసే వారికి తగిన శాస్తి చేస్తాం. వీరికి భవిష్యత్తు లేదు.
-వేణుగోపాల్ రెడ్డి , పొలికిమాకుల పల్లె, సోమల మండలం.
దమ్ముంటే ప్రాజెక్టు పరిశీలించండి…
తెలుగుదేశం నాయకులకు దమ్ము దైర్యం ఉంటే ప్రాజెక్టు వద్దకు వచ్చి ప్రజలతో చర్చాకు రావాలి. ఆరు మండలాల రైతులకు ఉపయోగపడే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కటి కూడ చేయలేదు. ప్రస్తుతం చేస్తుంటే అడ్డుపడతారా. రైతులపై మీకు ఎలాంటి ప్రేమ ఉందో తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మీకు గుణపాఠం నేర్పుతాం.
-బాబు నాయుడు కొల్లావచీర్, సోమల మండలం.
Tags; If the projects are built, who will lose?
