రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి సీఎం కావాలి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని మోదుగులపల్లెలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని బోయకొండ చైర్మన్ నాగరాజారెడ్డి , పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే డిజిటల్ బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. పార్టీలకు , కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అమలు చేసిన సంక్షేమ పథకాలను అవగాహన చేసుకుని వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి , సచివాలయాల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో నారాయణ, ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ నాయకులు బాబు, స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Tags: If the state is to develop, Jagan Mohan Reddy needs to be CM again
