ట్యాక్స్ ఎగ్గొడితే…అంతే

Date:19/06/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

పన్నులు ఎగవేసి.. దొరికితే జరిమానాలు చెల్లించి తప్పించుకోవచ్చులే అనుకుంటే ఇక ఎంతమాత్రం కుదరదు. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ కొత్త మార్గదర్శకాలను తెచ్చింది మరి. సవరించిన ఈ

నూతన నిబంధనల ప్రకారం తీవ్ర నేరాల కేసుల్లో ఇరుక్కున్నవారికి ఇక ఊరటనేదే లేదు. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, అవినీతి, బినామీ ఆస్తుల జప్తు, అప్రకటిత విదేశీ ఆస్తుల

కేసులు.. ఐటీ ఎగవేత నేరాల్లో ఊరటనిచ్చే అవకాశాలను మింగేయనున్నాయి. పన్ను డిమాండ్లు, జరిమానాలు, వడ్డీలు చెల్లించి ఐటీ ఎగవేత కేసులను పరిష్కరించుకోలేరు. ఈ మేరకు ప్రత్యక్ష

పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ)  స్పష్టం చేసింది. సవరించిన మార్గదర్శకాలు అన్ని కేసులకు వర్తిస్తాయని, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది కూడా. కొత్త నిబంధనల వివరాలను

అందరికీ తెలియజేయాలని సీనియర్ అధికారులకు సూచనలూ చేసింది.తాజా మార్గదర్శకాలు నేరాలను మూడు విభాగాలుగా వర్గీకరించాయి. టీడీఎస్, టీసీఎస్ కింద ఎగవేతలు, రిటర్నుల దాఖలులో

వైఫల్యం మొదటి కేటగిరీలోకి వస్తాయి. రెండో కేటగిరీలో ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలు, పన్ను రికవరీని అడ్డుకునేందుకు ఆస్తులను దాచడం వంటి నేరాలున్నాయి. ఇక మూడో కేటగిరీలో ప్రత్యక్ష

పన్ను చట్టాల కింద కోర్టులు అపరాధిగా ప్రకటించడం, బోగస్ ఇన్వాయిస్‌లతో మనీ లాండరింగ్‌కు పాల్పడటం, నల్లధనం, బినామీ లావాదేవీల చట్టం కింద విదేశీ బ్యాంక్ ఖాతాలు, ఆస్తులను

ప్రకటించకపోవడం వంటి నేరాలున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, లోక్‌పాల్, లోకాయుక్త ఇత ర ఏదైనా కేంద్ర, రాష్ట్ర సంస్థల దర్యాప్తుల్లో ఉన్నవారి పన్ను ఎగవేతలనూ సాధారణంగా

తీసుకోవద్దని సీబీడీటీ.. ఐటీ శాఖకు స్పష్టం చేసింది.

బాబును ముంచేసిన నేతల తప్పులు

Tags:If the tags are extinguished … that’s it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *