చింతపండు వ్యాపారుల జోలికొస్తే చూస్తు ఊరుకోను

If the tamarind traders get tired, they will not see

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హెచ్చరిక
– అధికారంలోనికి రాగానే సీటీవోను సస్పెండ్‌ చేస్తాం
– తప్పుడు కేసులు రద్దు చేస్తాం
– చింతపండు వ్యాపారులకు అండగా ఉంటా

Date:08/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

దేశంలో పేరుప్రఖ్యాతలు గాంచిన పుంగనూరు చింతపండు వ్యాపారులపై తప్పుడు కేసులు బనాయించినా, లంచాల కోసం వేదించినా చూస్తూ ఊరుకునేది లేదు…. ఎమ్మెల్యేగా వ్యాపారులకు అండగా నిలుస్తా…. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే వ్యాపారులను వేదిస్తున్నా సీటీవో శ్రీనివాసులనాయుడును వ్యాపారుల సమక్షంలో సస్పెండ్‌ చేస్తాం.. తప్పుడు కేసులు రద్దు చేస్తాం.. అంటు పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు హెచ్చరికలు చేశారు. గురువారం రాత్రి పుంగనూరు పట్టణంలో చింతపండు వ్యాపారుల సంఘ ప్రతినిధులు ఎంకెబి.ఇమ్రాన్‌ఖాన్‌, ఎంకెకె. హాఫీజ్‌, ఎస్‌జె.చాంద్‌బాషా, ఎస్‌ఏబి అఫ్జల్‌, ఎంఎస్‌.సలీం, ఎస్‌ఎండి.ఇస్మయిల్‌, హెచ్‌.రియాజ్‌, ఎంకెబి అర్షద్‌, ఎస్‌జెఎస్‌.అఫ్సర్‌తో పాటు వందలాది మంది వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించి, వినతిపత్రం అందజేశారు. పుంగనూరు పట్టణంలో చింతపండు వ్యాపారులను లంచాల కోసం సీటీవో అధికారులు వేదించడం , నిర్భంధించడం హేయమైన చర్య అన్నారు. పట్టణంలో వేలాది మంది వ్యాపారులుగా , కార్మికులుగా చింతపండుపై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి వ్యాపారులను అణగద్రొక్కేందుకు శ్రీనివాసులనాయుడును తెలుగుదేశం ప్రభుత్వం నియమించిందన్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరులో వ్యాపారుల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదన్నారు. అధికారం ఉందని నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తే చూస్తు ఊరుకోను జాగ్రత్త…. ఎమ్మెల్యేగా చింతపండు వ్యాపారులకు నాశక్తి మేరకు అండగా నిలుస్తానని హామి ఇచ్చారు. చింతపండు వ్యాపారులు ఇలాంటి వేదింపులపై ఆందోళన చెందకుండ తమ వ్యాపారాలను సజావుగా చేసుకోవాలన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ వైఎస్‌ఆర్‌సిపి పార్టీకి అండగా ఉన్నా, చింతపండు వ్యాపారులను భ యాందోళనలకు గురి చేసేందుకే ఇలాంటి వేదింపులు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా ఈ వేదింపులు మానుకోవాలన్నారు. లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని వ్యాపారులు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు రామలింగవెహోదలియార్‌, మగ్బుల్‌, బాబు, ఇర్ఫాన్‌, కుమ్మరవీధి మస్తాన్‌, ఆర్‌ఎస్‌.మహబూబ్‌బాషా, నూర్‌బాషా, తిరుపతి బాబా, దస్తగిరి, ఎహసాన్‌, ఖాదర్‌వల్లి, షరీఫ్‌, బాషు తదితరులు పాల్గొన్నారు.

 

గుడ్లకు టెండర్

Tags: If the tamarind traders get tired, they will not see

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *