ఆలయాలను అభివృద్దిచేస్తుంటే దుష్పచారం తగ దు
చౌడేపల్లె ముచ్చట్లు:
పురాతన ఆలయాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పివి మిథున్‌రెడ్డిల చొరవ తో కోట్లాది రూపాయాల ఖర్చుచేసి అభివృద్ది చేసి పురాతన వైభవం కోసం కృషిచేస్తుంటే దుష్పచారం చేయడం తగదని చౌడేపల్లె సర్పంచ్ వరుణ్‌భరత్ తెలిపారు. శనివారం ఓ పత్రికలో ఆలయాల అభివృద్దిపై అక్కసు వెళ్లగక్కడం తగదన్నారు. ఈ సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించారు. ఆగమశాస్త్రాలకు విరుద్దంగా శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయంలో ఎస్‌కెరమణారెడ్డి రంగులు వేయడం, వివిధ పనులు చేయడం విరుద్దమన్నారు.ఈ పనులను స్థఫతులు,శిల్పులు, అధికారులు, గ్రామ పెద్దలు కలిసి పరిశీలించామన్నారు. దేవదాయశాఖ నుంచిఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేప్రట్టడంతోపాటు చారిత్మ్రక చిహ్నాలను నాశనం చేస్తున్నారని గుర్తించినట్లు చెప్పారు .గ్రామస్తుల వినతి మేరకు మంత్రి దేవాదాయశాఖ అనుమతితో, మాస్టర్ ప్లాన్ ఏర్పాటుచేసి తద్వరా సుమారు రూ: 3.65 కోట్ల రూపాయాలతో రెండు ఆలయాలను పునర్మిణానం చ్యేసి పూర వైభవం కోసం అభివృద్దిచేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడునుంచి ప్రత్యేక శిల్పులను సైతం తీసుకొచ్చి ఆలయాలను అత్యంత సుంధరంగా ముస్తాబుచేయడానికి చర్యలు చేపట్టామన్నారు. మంత్రి చేస్తున్న అభివృద్దిను చూసి ఓర్వలేక ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరికలు చేశారు.

Tags: If the temples are being developed, corruption is not appropriate
