Natyam ad

జగనన్న లేకపోతే వలంటీర్లను పీకేస్తారు…- ఎంపీ మిధున్‌రెడ్డి

– సచివాలయాలను జన్మభూమి కార్యాలయాలుగా మార్చేస్తారు
– మాయల గారడి కి మోసపోకండి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

జాతిపిత మహాత్మగాంధిజి కన్న కలలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వలంటీర్ల ద్వారా ఎవరి రెకమెండేషన్‌ లేకుండ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించి సుపరిపాలన అందిస్తున్నారని….జగనన్న లేకపోతే సచివాలయాలను మూసేసి , జన్మభూమి కమిటి కార్యాలయాలుగా మార్చేస్తారని… వలంటీర్లను పీకేస్తారని… రాజంపేట ఎంపీ, లోక్‌ సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఎద్దెవ చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి రూ.2 కోట్లతో నిర్మించిన జెడ్పి గెస్ట్హౌస్‌ను ప్రారంభించారు. అలాగే 1200 మందికి భూ పంపిణీ చేశారు. ప్రాంగణంలో మొక్కలు నాటారు. మహిళలనుద్ధేశించి ఎంపీ మాట్లాడుతూ ఐదేళ్ల జగనన్న పాలనలో ఎవరి ప్రమేయం లేకుండ ప్రతి ఒక్కటి నేరుగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. జగనన్న లేకపోతే సంక్షేమం ఆగిపోతుందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మాటలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు బంగారు రుణాలు, డ్వాక్ర రుణాలు రద్దు , రైతు రుణాలు, ఇంటికోక ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఒక్కటి కూడ అమలు చేయక ప్రజలను మోసగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తుందంటే రకరకాల హామిలతో ప్రజలను మోసగించేందుకు తప్పుడు హామీలతో మ్యానిఫెస్టోను కొట్టి పంచుతారని, వాటిని నమ్మవద్దని ప్రజలను కోరారు. జగనన్న ఏ మాటలు చెప్పారో వాటిని అమలు చేసి నిజాయితీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. జగనన్నకు చంద్రబాబుకు పోలికే లేదన్నారు. చంద్రబాబు మాటలతో మోసం చేస్తే….జగనన్న మాటలను అమలు చేసి సుపరిపాలన అందిస్తున్నారని అభివర్ణించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగనన్నను మరో సారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి ఒక్కరు జగనన్నకు అండగా నిలిచి ఆశీస్సులు అందించాలని కోరారు. అలాగే రాబోవు ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్లలో అభివృద్ధి…

ముప్పె ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరును వైఎస్సార్త్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊహించని అభివృద్ధి చేపట్టడం జరిగిందని ఎంపీ తెలిపారు. పట్టణానికి బైపాస్‌ రోడ్డు, ఎంబిటి రోడ్డు విస్తరణ, ప్రతి గ్రామానికి రోడ్లు , కాలువలు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, ఆర్‌వోఆర్‌ ప్లాంట్లు నిర్మించామన్నారు. అలాగే పుంగనూరులో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు జగనన్న రెండు రిజర్వాయర్లను మంజూరు చేశారని ఎంపీ తెలిపారు. ఆ పనులను తెలుగుదేశం నాయకులు ఆపి వేశారని ఎద్దెవా చేశారు. అలాగే గండికోట వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు గండికోట రిజర్వాయర్‌ నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని పుంగనూరుకు తీసుకొచ్చే కార్యక్రమానికి నిధులు విడుదల చేయడం జరిగిందని , త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి తాగునీరు-సాగునీరు సమస్య లేకుండ చేస్తామని ఆయన తెలిపారు. హంద్రీనీవా కాలువలు విస్తరించి అన్ని చెరువులకు నీటిని తరలిస్తామన్నారు. పుంగనూరుకు అతి త్వరలోనే పెద్ద ఫ్యాక్టరీ రాబోతోందని, దీని ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఎంపీ స్పష్టం చేశారు.

Tags: If there is no Jagananna, the volunteers will be killed…- MP Midhun Reddy

Post Midle