Natyam ad

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేకపోతే బడుగులకు అంధకారమే

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోతే బడుగుబలహీన వర్గాలకు అంధకారమేనని దళిత నాయకులు, సర్పంచ్‌ ఆంజప్ప, రాజు, చెన్నరాయుడు, శంకరప్ప స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని ఏతూరు, నల్లగుట్లపల్లె , కొత్తపల్లె దళితవాడలలో ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని కోరారు. రాష్ట్రంలో బడుగుల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే బడుగులకు అంధకారమేనని తెలిపారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని కొనియాడారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీలతో గెలిపించి, జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుమార్‌, బాలాజి, చంద్ర, మణి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: If there is no YSRCP government, there will be darkness for the barangays

 

Post Midle