Natyam ad

మాజోలికి వస్తే పుంగనూరులో తిరగనీవ్వం- ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి 

పుంగనూరు ముచ్చట్లు:

 

మాపై అసత్య ఆరోపణలు చేసినా, అనవసరంగా మాట్లాడినా పుంగనూరులో తిరగనివ్వరని తెలుగుదేశం నాయకులకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హెచ్చరికలు చేశారు. గురువారం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్‌ ఆయోగ్యుడని ఎద్దెవా చేశారు. వార్డుమెంబరు కూడ కాలేని లోకేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని , పెద్దరెడ్డి అంటు విమర్శించడం చేస్తే తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. లోకేష్‌కు ముఖ్యమంత్రిని , మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. మాట్లాడటం కూడ చేతకానీ లోకేష్‌కు నిలకడ లేకుండ రోజుకు ఒకరికి చెప్పి విమర్శలు చేయిస్తున్నాడని తెలిపాడు. ఇలాంటి విమర్శలకు బయపడటం, తలొగ్గడం జరగదన్నారు. పుంగనూరు ప్రజల రుణం తీర్చుకోలేమన్నారు. సాధారణ రైతు కుటుంబానికి మూడు పదవులు ఇచ్చి అండగా నిలిచారని కొనియాడారు.

 

Post Midle

Tags; If we come to Majoli, we will turn to Punganur – MLA Dwarkanatha Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.