Natyam ad

మంత్రి కుటుంబంపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుదాం

సోమల ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబపై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ అనవసర ఆరోపణలు చేస్తే తగు రీతిలో బుద్దిచెబుదామని ఎంపీపీ ఈశ్వరయ్య తెలిపారు. సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గురువారం నాయకులు మాట్లాడారు. డబ్బున్న గర్వతో రామచంద్ర యాదవ్‌ మిడిసిపడుతున్నారని వారు చెప్పారు. గత ఎన్నికల్లోను టోకెన్లు , చీరల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి అభాసిపాలు అయ్యారని అన్నారు. గత 40 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి తో సరితూగలేరని చెప్పారు. పెద్ద ఉప్పరపల్లెలో పలు యాదవులకు పదవులు కట్టబెట్టిన చరిత్ర వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మరోసారి మంత్రి కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు అమాస మోహన్‌, నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గంగాధర్‌ రాయల్‌ , వైస్‌ఎంపీపీలు ప్రభాకర, సయ్యద్‌బాషా, జిసిఎస్‌ కన్వీనర్‌ మధు, గణపతి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: If you accuse the minister’s family, let’s be sensible

Post Midle