అవినీతికి పాల్పడితే బుల్ డోజర్ కింద మీరుంటారు

-కాంట్రాక్టర్లను తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Date:19/05/2018
భూపాల్ ముచ్చట్లు:
అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో అసంఘటిత కార్మికులు ఏర్పాటు చేసిన  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘బుల్ డోజర్ కింద రాళ్లకు బదులుగా మీరుంటారు’ అంటూ అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.రహదారుల పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఒకవేళ కాంట్రాక్టర్లు నిధుల వినియోగం విషయంలో అవినీతికి పాల్పడితే బుల్ డోజర్ కింద నలిగిపోయే రాళ్ల కింద ఉంటారని హెచ్చరించారు. రహదారుల నిర్మాణం నిమిత్తం వెచ్చించే సొమ్మంతా దేశ ప్రజలదని, అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించనని నితిన్ హెచ్చరించారు. ఎవరైనా నిధులు దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన అన్నారు.అసంఘటిత కార్మికులు ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘కాంట్రాక్టర్లు రహదారుల పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. తాను ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించనన్నారు. రోడ్లు వేయడానికి ఖర్చుపెడుతున్న సొమ్మంతా మీది కాదు. అదంతా దేశంలోని పేద ప్రజలది’ అని పేర్కొన్నారు.
Tags: If you are involved in corruption, you will be under Bull Dzor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *