మీరు సహకరిస్తే చిటికేలో కేసులు పరిష్కారం – న్యాయమూర్తి వాసుదేవరావు వెల్లడి
-రూ.61.80 లక్షలు ప్రరిహారం
పుంగనూరు ముచ్చట్లు:

మీరంత సహకరిస్తే చిటికెలో ఏన్ని కేసులైన లోక్‌అదాలత్‌లో పరిష్కరిస్తాం. ఇందుకు ఉదాహరణ శనివారం జరిగిన లోక్‌అదాలత్‌లో 296 కేసులు పరిష్కరించి, ఇందుకు గాను రూ.61.80 లక్షల పరిహారాన్ని అందించామని సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. శనివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందు, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గల్లాశివశంకర్‌నాయుడుతో కలసి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించి, అవార్డులు పంపిణీ చేశారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ జాతీయ లీగల్ సర్వీసస్ అథారిటి మేరకు కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించడం జరుగుతోందన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించే కేసులపై అప్పీల్ ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మైత్రి సంబంధాలను కొనసాగించేందుకు లోక్‌అదాలత్‌ను ప్రతి ఒక్కరు వేదిక చేసుకోవాలన్నారు. గ్రామ పెద్దలు, అధికారులు, న్యాయవాదులు తమ పరిధిలోని కేసుల్లోని వాది,ప్రతివాదులను పిలిపించి పరిష్కరించేందుకు సహకరించాలన్నారు. అందరి సహకారంతో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు వీలుందన్నారు. లోక్‌అదాలత్‌కు సహకరించిన న్యాయవాదులకు, అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆనందకుమార్, న్యాయవాదులు విజయకుమార్, బాలాజికుమార్ , వెంకటముని యాదవ్, వెంకట్రామయ్యశెట్టి, ఆకుల చెన్నకేశవుల, వినోద్, వైఎస్.భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags; If you cooperate, cases will be solved in no time – Justice Vasudeva Rao reveals
