మంత్రి పెద్దిరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎవరైనా విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని దళిత నాయకులు రాజు, శంకరప్ప, చెన్నరాయుడు హెచ్చరించారు. సోమవారం ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ నీతినిజాయితీగా పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డిని లోకేష్ విమర్శించడం బాధకరమన్నారు. రాజకీయ అవగాహన కూడ లేని లోకేష్ మంత్రిని విమర్శిస్తే తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. దళిత సంఘాల ్యధ్వర్యంలో నిరసనలు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పెంచుపల్లి కృష్ణ, శ్రీనివాసులు, రమణ, గోవిందు, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: If you criticize Minister Peddireddy, let’s just sit back and watch
