మహారాష్ట్రలోని అలీబాగ్ బీచ్‌‌కు వెళ్తే.

సముద్రంలో ఓడలు

Date:04/01/2020

ముంబై ముచ్చట్లు:

మహారాష్ట్రలోని అలీబాగ్ బీచ్‌‌కు వెళ్తే.. అక్కడ గుర్రపు బండ్లు సముద్రంలో తిరుగుతూ కనిపిస్తాయి. అదేంటీ? సముద్రంలో పడవలు కదా తిరగాల్సింది.. గుర్రపు బండ్లు ఎందుకు తిరుగుతున్నాయనే కదా మీ ప్రశ్న! అయితే, తప్పకుండా మీరు ఈ పర్యాటక స్థలం గురించి తెలుసుకోవల్సిందే.అలీబాగ్‌లో సముద్ర తీరంలో కొలాబా అనే పురాతన కోట ఉంది. ఒకప్పుడు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కోట కాలక్రమేనా సముద్రంలో కలిసిపోయింది. సముద్ర నీటి మట్టం పెరిగి ముందుకు రావడంతో కోట మొత్తం నీటిలో మునిగింది. దీంతో ఆ ప్రాంతం చిన్న సైజు దీవిని తలపిస్తుంది. అక్కడికి నీటిలో నడుచుకుంటూ వెళ్లడం చాలా ప్రమాదం. ఈత వస్తేనే ఆ సాహసం చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక్కోసారి సముద్రమట్టం అకస్మాత్తుగా పెరుగుతుంది.నీటి మధ్యలో ఉన్న ఈ కోటను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు స్థానికులు గుర్రపు బండ్లును సముద్రంలో నడుపుతూ పర్యాటకులను కోట వద్దకు చేర్చుతున్నారు. గుర్రాలతోపాటు పర్యాటకుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వకపోయినా.. అక్రమంగా గుర్రపు బండ్లను నడుపుతున్నారు. దీంతో జంతు హక్కుల సంఘాలు నిర్వాహకులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.సముద్రంలో పడవులు మాత్రమే ప్రయాణించాలని, వాటికి బదులు గుర్రపు బండ్లను ఉపయోగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోజంతా సముద్ర నీటిలో ఉండటం వల్ల ఆ గుర్రాలు అనారోగ్యానికి గురై చనిపోతున్నాయని తెలుపుతున్నారు. జంతు హింసను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అక్కడ గుర్రపు బండ్లకు బదులు పడవలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

బోస్టన్ కమిటి నివేదిక సబ్ మిట్

 

Tags:If you go to Alibag beach in Maharashtra.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *