Natyam ad

ప్యాన్‌గుర్తుకు ఓటేస్తే ఇంటి గుమ్మం వద్దకే సంక్షేమం

చౌడేపల్లె ముచ్చట్లు:

కుల మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి నిరుపేద ల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కే దక్కుతుందని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు అన్నారు. ఆదివారం జెసీఎస్‌ కన్వీనర్‌ రుక్మిణమ్మ, మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌, బోయకొండ మాజీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ సర్పంచ్‌ వరుణ్‌ భరత్‌లతో కలిసి చౌడేపల్లె టౌన్‌లో ఇంటిటా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిలకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పథకాలన్నీ మళ్లీ కొనసాగలంటే జగనన్నను మళ్లీ సీఎం చేయాలని కోరారు. జగనన్న విడుదల చేసిన మెనిఫేస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఠాణాధార్‌నాగరాజ, మిద్దింటి కిషోర్‌బాబు, రవిచంద్రారెడ్డి, అండేరాజన్న, చిత్తూరు రాధాకృష్ణ,మంజునాథ్‌,రూపారేఖ, కళ్యాణ్‌భరత్‌, రాంకీ, హరీష్‌, పవన్‌ ,భాస్కర్‌ ,మురళీ ,తదితరులున్నారు.

 

Post Midle

Tags: If you vote for pangurthu, welfare is at your doorstep

Post Midle