పుంగనూరులో 16న మంత్రి పెద్దిరెడ్డిచే ముస్లింలకు ఇఫ్తార్
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఇవ్వనున్నారు. శనివారం రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, రాయలసీమ జిల్లాల మైనార్టీసెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ లు కలసి షాదిమహల్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కూడ హాజరౌతున్నట్లు నాగభూషణం తెలిపారు. ఈ మేరకు ముస్లింలతో ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ సీతారామన్, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహస్, అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం, కార్యదర్శి ఇబ్రహిం, బిటి.అతావుల్లా, మక్కాకమిటి డైరెక్టర్ ఖాదర్ ,జావీద్, బిజి.రఫి, తదితరులు పాల్గొన్నారు.

Tags: Iftar for Muslims by Minister Peddireddy on 16th in Punganur
